CM REVANTH REDDY: చంద్ర గ్రహణం తొలగి.. ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు

  • By: sr    news    Mar 08, 2025 9:15 PM IST
CM REVANTH REDDY: చంద్ర గ్రహణం తొలగి.. ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు

CM REVANTH REDDY:

విధాత‌: ఉమెన్స్ డేను పుర‌స్క‌రించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో శ‌నివారం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జ‌రిగింది. ఈ సందర్భంగా ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారుఈ స‌భ‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్ల‌డుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో మా ఆడబిడ్డలు రాణీరుద్రమలు, చాకలి ఐలమ్మల స్ఫూర్తితో మహిళా శక్తిని చాటార‌ని, రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డలు తమ ఆత్మగౌరాన్ని చాటుతున్నారని, చంద్ర గ్రహణం తొలగి మా ఆడబిడ్డలు ఇవాళ వెలుగులు చూస్తున్నారన్నారు.

మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసినప్పుడే రాష్ట్రం ఆర్ధికంగా పురోగమిస్తుందని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసినప్పుడే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంద‌న్నారు.
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని వాటి నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామ‌ని, అధేవిధంగా కోటి 30 లక్షల జతల స్కూల్ యూనిఫామ్ కుట్టు పని ఆడబిడ్డలకు ఇచ్చామ‌ని, మహిళా సంఘాల సమావేశాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో రూ. 25 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నాం అన్నారు.

అంతేగాక మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను వారికి అప్పగించామ‌ని,
అదానీ అంబానీలతో మహిళలు పోటీ పడేలా కార్యాచరణ చేపట్టాం అన్నారు. ఆర్టీసీ బస్సులకు మహిళలలను యజమానులను చేస్తున్నాం అని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు కాబోతున్నారని, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అని వెళ్ల‌డించారు.

సోనియాగాంధీ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించార‌ని, రాజకీయాల్లో మహిళలు రాణించాలి.. సమాజానికి సేవ చేయాలన్నారు. మహిళలకు అండగా నిలబడింది ఇందిరమ్మ రాజ్యం కాదా ఒక్కసారి ఆలోచించండి. ఆడబిడ్డల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోడౌన్స్ నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాన‌ని తెలిపారు. మిల్లుల్లో ధాన్యాన్ని బొక్కుతున్న పందికొక్కులకు, దొంగలకు బుద్ధి చెబుతాం అన్నారు. ప్రభుత్వమే మహిళల‌కు స్థలం ఇస్తుంది.. రుణాలు ఇస్తుంది.. మీరే గోడౌన్స్ నిర్మించండి.. వ్యాపారవేత్తలుగా మారండి..మీకు ప్రభుత్వం అండగా ఉంటుంద‌న్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది అని, ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేలా తీర్చి దిద్దుతాం అన్నారు. ఆనాటి ఇందిరమ్మ శక్తి… ఎన్టీఆర్ యుక్తి.. ఈ నాటి మీ రేవంతన్న స్ఫూర్తితో మీరు ముందుకు వెళ్లాలి.. కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా మీరు వ్యాపారాల్లో ముందుకెళ్లాలి.. తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి అన్నారు. టన్నెల్ కూలితే, పంటలు ఎండితే బీఆరెస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని, వాళ్ల పైశాచిక ఆనందం కోసం నన్ను తిడుతున్నారు ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయత్నించాలి.. మీ అనుభవంతో సూచన చేయాలి.. కానీ పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు పైశాచిక ఆనందం పొందేవారు బాగుపడినట్టు చరిత్రలో లేదని అన్నారు.

ఈ సంద‌ర్భంగా.. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (2,82,552 సంఘాలు) 22 వేల 794 కోట్ల 22 లక్షల రూపాయల (రూ.22794,22,00,000) చెక్కును, లోన్ బీమా మరియు ప్రమాద బీమా పథకాల ద్వారా 44 కోట్ల 80 లక్షలు ( రూ.44,80,00,000) చెక్కుల‌ను అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంద‌జేశారు. అధేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్స్ కు ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.