Abuj Mud | అబుజ్ మడ్‌ను.. ముట్టడించిన భద్రతా బలగాలు!
విధాత: మావోయిస్టుల కేంద్ర స్థావరంగా..పెట్టని కోటగా భావిస్తున్న చత్తీస్ గఢ్ లోని అబూజ్ మడ్ అడవులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆపరేషన్ మడా బచావో పేరుతో సీఆర్పీఎఫ్ బలగాలు అబూజ్ మడ్ మావోయిస్టు స్థావరాలపై దాడులకు దిగాయి. ఈ సందర్భంగా మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఐదు గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయని స్థానిక ఎస్పీ వెల్లడించారు. ఎన్ కౌంటర్ కొనసాగుతున్న ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఆపరేషన్ లో మావోయిస్టులు భారీ సంఖ్యలో మృతి చెందారని భావిస్తున్నామన్నారు. ఛత్తీస్ గఢ్ నారాయణపురం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిన భద్రత బలగాలలకు.. మావోయిస్టుల మధ్య భారీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని ఎస్పీ వివరించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యం పరిధిలో కొనసాగుతున్న మావోయిస్టుల ఏరివేత ఘట్టం భద్రతా బలగాలు అబుజ్ మడ్ లోని మావోయిస్టుల కీలక స్థావరాల ముట్టడితో తుది దశకు చేరుకుందని అంచనా వేస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram