Rohini Khadse Khewalkar: ప్లీజ్.. శిక్ష లేకుండా ఒక్క మర్డర్ చేసే చాన్స్ ఇవ్వండి: రాష్ట్రపతికి లేఖ

విధాత: ఎలాంటి శిక్ష లేకుండా (Without punishment) ఒక్క మర్డర్ (One murder) చేసుకునే అవకాశం మహిళలకు ఇవ్వండని (Give pportunity to Womens) నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ-శరద్ పవార్( NCP SP) మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే (Rohini Khadse Khewalkar) ఏకంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖ సంచలనంగా మారింది.
స్త్రీలందరి తరపున మేం ఒకటే డిమాండ్ చేస్తున్నామని.. ఒక మర్డర్ చేసేందుకు మాకు ఇమ్యూనిటీ కల్పించండని ఆమె తన లేఖలో రాష్ట్రపతిని కోరారు. మహిళలపై నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి శిక్ష లేకుండా ఒక మర్డర్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని ఆమె తన లేఖలో కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సం సందర్భంగా దేశంలో మహిళలు, బాలికలపై పెరిగిపోతున్న హింసను రోహిణి ఖడ్సే ప్రస్తావిస్తూ ఈ లేఖ రాశారు. చట్టాలు ఎన్ని ఉన్నా..మహిళలు, బాలికలపై హింస ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే లేఖలో శిక్ష లేకుండా మహిళలకు తమ రక్షణార్ధం ఒక మర్డర్ చేసుకునే అవకాశం కల్పించాలని ఆమె కోరడం వైరల్ గా మారింది.