Weather Report | మరో మూడురోజులు మాడుపగిలేలా ఎండలు..! ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

  • By: Tech |    news |    Published on : Mar 31, 2024 10:22 AM IST
Weather Report | మరో మూడురోజులు మాడుపగిలేలా ఎండలు..! ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ

Weather Report | తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఉదయం తొమ్మిది దాటిందంటే చాలు ఎండలు తీవ్రత విపరీతంగా పెరుగుతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఇప్పటికే ఎండలు 40 డిగ్రీలను దాటాయి. మరో వైపు రాగల మూడురోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, దాంతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్టె్‌ను జారీ చేసింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలతో పాటు నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్‌ ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలతో జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలతో పాటు రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి వేడిగా ఉంటుందని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.