Aadi Saikumar: ఒకటి కాదు రెండు కాదు.. వరుసబెట్టి సినిమాలు

విధాత: జయపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar). ఎడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
నిర్మాతలకు అందుబాటులో ఉండడం, చిన్న బడ్జెట్ చిత్రాలెక్కువగా ఉంటుండడంతో ఎప్పుడు చూసినా చేతినిండా సినిమాలతో కనిపిస్తూ ఉంటాడు. కొన్ని సినిమాలు థియేటర్‌లో, మరి కొన్ని ఓటీటీలో విడుదలవుతుండడంతో నెల, రెండు నెలలోసారి ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటున్నాడు.
అయితే డిసెంబర్ 23 సోమవారం ఆది జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న పలు సినిమాల నుంచి మేకర్స్ ఆప్డేట్స్ ఇచ్చారు.
వాటిలో ఇన్‌స్పెక్టర్, శంబాల సినిమాల నుంచి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పటికే పూర్తి చేసిన షణ్ముఖ చిత్రం వచ్చే ఎడాది ప్రేక్షకులను అలరించనున్నాయి.