Tollywood: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టూ! కలెక్షన్లంతా ఫేకేనయా

ఐటీ దాడుల నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో బ్లాక్ మనీ అంశం చర్చనీయాంశం అయింది. హీరోలు తీసుకునే భారీ రెమ్యూనరేషన్స్ మొదలు, సినిమాల పెట్టుబడులు, వసూళ్ల వరకు బ్లాక్ దందా ఇంకా నడుస్తూనే ఉందన్న ప్రచారం ఊపందుకుంది. హీరోలు వారి రెమ్యూనరేషన్‌లో సగం బ్లాక్ పద్దతిన తీసుకోవడం వల్ల ఐటీతో ఇబ్బంది పడాల్సి వస్తుందన్న టాక్ వినిపిస్తూనే ఉండగా, మిగతా హీరోల సంగతి తనకు తెలీదని వెంకటేష్ తాను పూర్తిగా వైట్‌లోనే తీసుకుంటానని క్లారిటీ ఇచ్చారు.
అయితే టాలీవుడ్‌లో ఓ హీరో రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని, మరోకరు రూ. 300 కోట్లు తీసుకుంటున్నట్లు జరుగుతోన్న ప్రచారాల్లో కూడా నిజం లేదని , హైప్ కోసం వారు చేసుకుంటున్న ప్రచారాల వల్ల ఐటీ అధికారుల చూపు సినిమా ఇండస్ట్రీపై పడేలా చెస్తుందనే చర్చ నడుస్తోంది. అయితే ఎవరెంత తీసుకుంటున్నారనే లెక్కలు మాత్రం ఆదాయపన్ను శాఖకు మాత్రమే తెలుస్తుంది.
నిజానికి.. రెగ్యులర్‌గా ట్యాక్సులు చెల్లించే వారిలో ఎప్పుడు బాలీవుడ్ హీరోల పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపించడం అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు టాలీవుడ్ హీరోలు రెమ్యునరేషన్ అంశంలో టాప్ టెన్ ప్లేస్‌లో ఉండి కూడా ట్యాక్స్‌లు చెల్లించే విషయంలో వీరు పేర్లు ఎన్నడూ వినిపించని తరుణంలో వీరికి రెమ్యూనరేషన్లు ఎక్కువనే విషయం ఎలా నమ్మగలమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక బ్లాక్‌ను వైట్ చెసుకునే స్ట్రాటజీని అమలు పరచటం, సినిమా పరిశ్రమ వేదికగా చాలాకాలంగా ఈజీగా జరుగుతోందని చాలామంది ఆర్దిక నిపుణులు అంటున్న మాట. బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించే ఈ బ్లాక్ దందా టాలీవుడ్ లోనూ ఉందని.. ఓవర్సీస్ లో వసూళ్లను మ్యానిప్లేట్ చెస్తూ.. బ్లాక్ ను వైట్ చెస్తున్న తీరు ఎక్కువగా ఉందని వినికిడి. ముఖ్యంగా ప్లేస్ మెంట్.. లేయరింగ్. ఇంటిగ్రేషన్ ఇలా మూడు విధానాలను స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చెస్తున్నట్లు తెలుస్తొంది.
ఇక సినిమా వసూళ్లను భారీగా ప్రకటించే క్రమంలో.. ఐటీ డిపార్ట్మెంట్ కు చూపే లెక్కల విషయంలో తేడాలుంటే ఇబ్బంది పడతామనే విషయాన్ని సినిమా ఇండస్ట్రీ సీరియస్‌గా తీసుకోవటం లేదని. ధియేటర్స్ ఖాళీగా ఉన్నా.. వసూళ్లు భారీగా ఉండటం అనేది.. బ్లాక్ ను వైట్ చేసుకునే పద్దతిగా ఆర్దిక నిపుణులు చెబుతున్నారు. అయితే 20 ఏళ్ల క్రితం కంటే ..ఇప్పుడు బ్లాక్ మనీ దందా సినీ పరిశ్రమలో తగ్గిందని.. సినిమా ఇండస్ట్రీ ని ఇప్పుడు నిర్మాతల కంటే ఫైనాన్సియర్స్ కంట్రోల్ చెస్తున్న పరిస్థితి ఎక్కువగా ఉందని కూడా ప్రచారం జరుగుతోంది.