Jr NTR విధాత: రాముని కథగా మహా కళాఖండంగా భారీ అంచనాలతో విడుదలైన ‘ఆదిపురుష్’ మొదటి వారంలోనే చతికిలబడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకూ వచ్చిన రామాయణ ఇతిహాస కథాంశంతో తెరకెక్కిన సినిమాలు వేటిపై రాని విధంగా.. ఈ సినిమా గురించి అంత ఘనంగా ట్రోల్స్ వినిపించాయి. ప్రేక్షకులలో, ముఖ్యంగా హిందూత్వ వాదులలో, ప్రభాస్ అభిమానులలో తీవ్ర నిరాశను మిగిల్చిందీ చిత్రం. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనేలా.. ఇప్పటికే సినిమాపై నెగిటివిటీ […]
Jr NTR
విధాత: రాముని కథగా మహా కళాఖండంగా భారీ అంచనాలతో విడుదలైన ‘ఆదిపురుష్’ మొదటి వారంలోనే చతికిలబడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకూ వచ్చిన రామాయణ ఇతిహాస కథాంశంతో తెరకెక్కిన సినిమాలు వేటిపై రాని విధంగా.. ఈ సినిమా గురించి అంత ఘనంగా ట్రోల్స్ వినిపించాయి. ప్రేక్షకులలో, ముఖ్యంగా హిందూత్వ వాదులలో, ప్రభాస్ అభిమానులలో తీవ్ర నిరాశను మిగిల్చిందీ చిత్రం.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనేలా.. ఇప్పటికే సినిమాపై నెగిటివిటీ వచ్చేసింది. కోర్టులు చిత్రయూనిట్‌పై మొట్టికాయలు వేసే వరకు పరిస్థితులు చేరాయి. ఇలాంటి సమయంలో ‘జైలవకుశ’ సినిమా టైమ్‌లో ‘రామాయణం’పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడిన ఓ వీడియో హల్చల్ చేస్తోంది.
ముఖ్యంగా రావణుడి పాత్రను తెరమీద చిత్రించిన విధానంపై ఆయన మాట్లాడిన మాటలతో ‘ఆదిపురుష్’ టీమ్‌పై మరింతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రావణుడి హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్‌తో సహా రెండు తలల్లో పది తలలను చూపించడం వంటివి ఎక్కడా ఇంతకు ముందు చూడలేదనేలా ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్న విషయం.. యంగ్ టైగర్ మాటలతో మరింతగా ప్రేక్షకులకు కోపాన్ని తెప్పిస్తుంది.
‘‘నేను ‘జై లవ కుశ’ చేసిన సమయంలో ఆనంద్ నీలకంఠ రాసిన అసుర పుస్తకాన్ని చదివాను. దాని ప్రకారం రావణుడు 18 లోకాలకు అధిపతి, అసుర చక్రవర్తి అన్ని లోకాలకు అధిపతి అయిన రాక్షసరాజు ఎంతో నేర్పుతో ఉంటాడు. అతని చూపు, శరీరం ఎంతో గంభీరంగా ఉంటుంది. అది ప్రేక్షకులకు మరెంత గంభీరంగా కనిపించాలి.
రాముడు యుద్ధం చేస్తూ రావణుడిని చూస్తూ ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అంటూ రావణుడిని చూసి పొగుడుతూ పద్యం చెబుతాడు. రావణుడి పాత్రను చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ప్రేక్షకులు సైతం అతని ఆకారాన్ని, చూసి పొగిడేలా ఉండాలి. అలా రావణుడి గురించి తెలుసుకుని చేసిందే ‘జైలవకుశ’ సినిమా’’ అని వివరంగా చెప్పుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.
ఒక సినిమాలో గంభీరమైన పాత్ర చేసేందుకే ఎన్టీఆర్ చాలా విషయాలను తెలుసుకుంటే ‘రామాయణం’ వంటి ఇతిహాసాన్ని తెరకెక్కించే ప్రయత్నాన్ని భుజాలకెత్తుకున్న ఓం రౌత్ ఇంకెంత బాధ్యతగా వ్యవహరించి ఉండాలి. రావణుడి పాత్రపై సరైన అవగాహన లేకుండా, ఎటువంటి పరిశోధనా చేయకుండా సినిమాను చిత్రీకరించారని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతుండటం కొసమెరుపు.