ఏపీ ప్రభుత్వానికి కత్తి మహేష్ తండ్రి అభ్యర్థన

తిరుపతి,విధాత‌: సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతిపై రోజురోజుకూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్ తండ్రి ఓబులేసు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ మరణించిన విషయం తమ కంటే ముందే బయటకు చెప్పారని తెలిపారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం వయోభారం రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కత్తి మహేష్‌ తండ్రి ఓబులేసు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్ మృతిపై […]

ఏపీ ప్రభుత్వానికి కత్తి మహేష్ తండ్రి అభ్యర్థన

తిరుపతి,విధాత‌: సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతిపై రోజురోజుకూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్ తండ్రి ఓబులేసు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ మరణించిన విషయం తమ కంటే ముందే బయటకు చెప్పారని తెలిపారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం వయోభారం రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని కత్తి మహేష్‌ తండ్రి ఓబులేసు విజ్ఞప్తి చేశారు. కత్తి మహేష్ మృతిపై సిట్టింగ్ జడ్జితో ఏపీ ప్రభుత్వం విచారణ జరిపించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కత్తి మహేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో, తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ, జగన్ కోసం ప్రచారం చేశారని, అలాంటి వ్యక్తి చనిపోతే సీఎం జగన్ కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని మందకృష్ణ విమర్శించారు. మహేష్ భౌతిక కాయానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి సహా ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా నివాళులర్పించకపోవడం అన్యాయమని దుయ్యబట్టారు. దళితులంటే ఇంకా చులకన భావమే ఉందని, గౌరవం, గుర్తింపు ఇవ్వబోరని మరోసారి అర్థమైందని మందకృష్ణ అన్నారు. ఇప్పటికే కత్తి మహేష్ మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మహేష్ కారు డ్రైవర్ సురేష్‌ను నెల్లూరు జిల్లా పోలీసులు విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగినప్పుడు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే సురేష్‌కు ఎందుకు చిన్న గాయం కాలేదని అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రమాదం తర్వాత ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.