లష్కరే టాప్‌ కమాండర్‌ అల్తాఫ్‌ లల్లీ హతం

  • By: sr    news    Apr 25, 2025 3:31 PM IST
లష్కరే టాప్‌ కమాండర్‌ అల్తాఫ్‌ లల్లీ హతం

విధాత : పహల్గామ్ ఉగ్రదాడితో అప్రమత్తమైన భద్రతాబలగాలు జమ్మూకశ్మీర్‌లో సాగిస్తున్న ఉగ్రవేటలో కీలక విజయం సాధించాయి. తాజాగా లష్కరే టాప్‌ కమాండర్‌ అల్తాఫ్‌ లల్లీని మట్టుబెట్టాయి. ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది కశ్మీర్‌లో అడుగుపెట్టిన వేళ ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ లో భద్రతా దళాలకు బందీపొరాలో అల్తాఫ్‌ ఆచూకీ తెలిసింది. శుక్రవారం ఆర్మీ-పోలీసు దళాలు జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈక్రమంలో ఉగ్రవాదులను గుర్తించడంతో ఎన్‌కౌంటర్‌ మొదలైంది. తొలుత ఓ ఉగ్రవాది గాయపడ్డాడు. ఆ తర్వాత భద్రతా దళాల్లోని అధికారి బాడీగార్డులకు తూటాలు తాకాయి. ఎన్ కౌంటర్ లో అల్తాఫ్‌ను మట్టుబెట్టారు.