JSW: రూ.16 వేల కోట్ల పెట్టుబడి.. అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించిన మమతా బెనర్జీ

  • By: sr    news    Apr 22, 2025 5:14 PM IST
JSW: రూ.16 వేల కోట్ల పెట్టుబడి.. అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించిన మమతా బెనర్జీ

కోల్‌కతా: భారతదేశంలో ప్రముఖ ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్, పశ్చిమ బెంగాల్‌లోని సాల్బోనిలో 1,600 మెగావాట్ల (2×800 మెగావాట్లు) సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్ట్రా సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సంగీతా జిందాల్, తదితర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొన్నారు. రూ.16,000 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు సంస్థ చేపట్టిన అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుగా నిలిచింది. ఈ ప్లాంట్‌కు పశ్చిమ బెంగాల్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (డబ్ల్యూబీఎస్‌ఈడీసీఎల్)తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదిరింది. షక్తి బీ (IV) విధానం కింద పశ్చిమ బెంగాల్‌కు కేటాయించిన దేశీయ బొగ్గును ఈ ప్లాంట్ ఉపయోగిస్తుంది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఆర్థిక ప్రభావం..

సాల్బోని ప్రాజెక్టు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తూర్పు భారత విస్తరణ వ్యూహంలో కీలకమైనది. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ పారిశ్రామిక సౌకర్యాలను బలపరిచి, విస్తృత ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. స్థానిక వనరుల వినియోగం, నైపుణ్యాభివృద్ధి ద్వారా సాల్బోని, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ… “సాల్బోనిలో మా ప్రస్థానం ప్రారంభమైన చోటికి తిరిగి రావడం సంతోషానిస్తోంది. ముఖ్యమంత్రి మమతా దీదీ స్ఫూర్తిదాయక నాయకత్వం, సహకారం, మార్గదర్శనం లేకుండా ఈ ప్రస్థానం సాధ్యం కాదు. బెంగాల్ కోసం ఆమె దార్శనికత, ప్రజలపై నమ్మకం మమ్మల్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, వృద్ధి సాధించడానికి ప్రేరేపిస్తున్నాయి.

1600 మెగావాట్ల అల్ట్రా సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ మా గ్రూప్‌లో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్, పశ్చిమ బెంగాల్‌లో ప్రైవేటు రంగంలో అతిపెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో భాగంగా రూ. 16,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నాంః. సాల్బోనిలో 2000 ఎకరాల విస్తీర్ణంలో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఇది ఆధునిక అర్బన్ ప్లానింగ్ సూత్రాలతో ప్లగ్-అండ్-ప్లే సౌకర్యంతో నిర్మితమవుతుంది. ఈ ఇండస్ట్రియల్ పార్క్ రాష్ట్రం, తూర్పు భారత ప్రాంతంలో పారిశ్రామిక, ఆర్థిక వృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలుస్తుంది” అని తెలిపారు.