Chiranjeevi: మార్క్ శంకర్ ఇంటికొచ్చాడు: చిరంజీవి
విధాత: మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వెల్లడించారు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఇంకా కోలుకోవాల్సి ఉందన్నారు. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడని చిరంజీవి ఆకాంక్షించారు.
రేపు హనుమత్ జయంతి అని.. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడని చిరంజివి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారని. ఆశీస్సులు అందచేస్తున్నారని తెలిపారు.
నా తరపున, తమ్ముడు, మార్క్ శంకర్ తండ్రి పవన్ కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నామని చిరంజీవి పేర్కొన్నారు.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా… pic.twitter.com/nEcWQEj92v— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram