ICUలో.. మార్క్ శంకర్‌కు చికిత్స!

  • By: sr    news    Apr 09, 2025 12:26 PM IST
ICUలో.. మార్క్ శంకర్‌కు చికిత్స!

విధాత : సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అతను క్రమంగా కోలుకుంటున్నట్లుగా వైద్యులు తెలిపారు. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో మార్క్ కు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు. భారత కాల మానం ప్రకారం ఈ రోజు ఉదయం మార్క్ శంకర్ ను అత్యవసర వార్డుకు తరలించారు.

కొడుకు వద్ధకు చేరిన పవన్.. చిరంజీవి

అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ను చూసేందుకు పవన్ కల్యాణ్ నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లి మార్క్ ను చూశారు. మార్క్ ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మార్క్ కోలుకొంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా మార్క్ శంకర్ వద్ధకు చేరుకున్నారు.