Komati Reddy VenkatReddy : “బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్”లో సత్తా చాటండి

బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్‌లో యువత తమ ప్రతిభ చూపి రూ.3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోండి.

Komati Reddy VenkatReddy : “బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్”లో సత్తా చాటండి

విధాత, హైదరాబాద్: “బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్” పోటీలలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, మన ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై యువత షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ రూపొందించి సృజనాత్మకతను చాటుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన “బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్” ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.

“బతుకమ్మ యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్” లో పాల్గొని తెలంగాణ యువత తమ ప్రతిభను చాటి..నగదు బహుమతులు గెలుచుకోవాలని సూచించారు. పోటీలలో ప్రథమ బహుమతి – రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి – రూ.2 లక్షలు, తృతీయ బహుమతి – రూ.1 లక్ష, కన్సోలేషన్ బహుమతి – రూ.20,000 (5 మందికి) అందించడం జరుగుతుందని తెలిపారు. పోటీలకు ఈ నెల సెప్టెంబరు 30లోగా తమ ఎంట్రీలను పంపించాలని పేర్కొన్నారు.