Minister Konda Surekha || రామ భక్తులైతే భద్రాచలానికి రెట్టింపు నిధులుతెండి

జై శ్రీరామ్ అంటే పైసలు పడ్తయా అని నేను మాట్లాడిన మాటలతో సంబంధం లేకుండా నేను రామున్ని తిట్టానని బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు

 

విధాత, ప్రత్యేక ప్రతినిధి: జై శ్రీరామ్ అంటే పైసలు పడ్తయా అని నేను మాట్లాడిన మాటలతో సంబంధం లేకుండా నేను రామున్ని తిట్టానని బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నిజంగా రామ భక్తులైతే భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన దానికి కేంద్ర ప్రభుత్వం రెండింతలు అంటే రూ. 760 కోట్లు సాంక్షన్ చేయండి … అప్పుడు మీకు రాముని మీద ఉన్న భక్తేంటో? అందరికీ తెలుస్తుందంటూ ఎదురు ప్రశ్నించారు.

ఇప్పటి వరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా రాముని కళ్యాణానికి భద్రాచలం రాలేదని విమర్శించారు. తానేదో రాముని తిడుతున్నానంటూ, హిందువుల మనోభావాలను కించపరుస్తున్నానంటూ నేను మాట్లాడిన అంశాల్లోని రెండు ముక్కలను కట్ చేసి తప్పుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పైన తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదంటూ గట్టిగా హెచ్చరించారు. గురువారం హనుమకొండలో జరిగిన రైతు మేళా కార్యక్రమంలో మంత్రి సురేఖ తీవ్రంగా ప్రతిస్పందించారు.

బుధవారం ఆమె చేసిన జై శ్రీరామ్ అంటే పైసలు పడుతాయా? అంటూ చేసిన వ్యాఖ్యల పై కొందరు బీజేపీ నాయకులు మాట్లాడుతూ మంత్రి సురేఖ రామున్ని కించపరిచారంటూ విమర్శించిన దానికి ఆమె స్పందించారు. పలువురు బీజేపీ నాయకులతో పాటు ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం స్పందిస్తూ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ రామున్ని కించిపరిచారని పేర్కొన్న నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ … మేము కూడా హిందువులమే… రామున్ని అందరూ పూజిస్తారు. రామున్ని బీజేపీ నాయకులు మీరేం కనిపెట్టలేదు…పూర్వకాలం నుంచి ఉన్నారని, అయినా ఎవరైనా హిందువులమని తలకు బోర్డుపెట్టుకోరని, ఇక ఈ బీజేపీ నాయకులైమైనా బోర్డులు మెడకేసుకుని తిరుగుతున్నారో నాకైతే తెలువదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రాముడు కొలువై ఉన్న భద్రాచలం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 380 కోట్లు కేటాయించారని, ఏటా రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ కేంద్రమంత్రులు, ఎంపీలకు రామునిపై ప్రేమ ఉంటే రెండింతల నిధులు కేంద్రం నుంచి తీసుకరావాలని మంత్రి సవాల్ చేశారు. అభివృద్ధి గురించి నిధులు తేకుండా తన పై ఏదో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని సురేఖ హెచ్చరించారు.

Latest News