NCL Recruitment 2026 | ప్రభుత్వ రంగ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (NCL)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 577 ఖాళీలను భర్తీ చేయనున్నారు. హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (HEMM) ఆపరేటర్లు, పారామెడికల్ స్టాఫ్, ఓవర్‌సీల్ పోస్టులను ఇందులో భర్తీ చేయనున్నారు.
అర్హత
పోస్టులను బట్టి పదోతరగతి/ఇంటర్/ఐటీఐ డిప్లొమో/బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించి, అందులో ఎంపికైన వారి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి తుది నియామకాలు చేపడతారు. సీబీటీలో అన్‌రిజర్వ్‌డ్/ఈడబ్ల్యూఎస్‌లు 50 శాతం, ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు/ఓబీసీ/దివ్యాంగులు 40 శాం కనీస అర్హత మార్కులు పొందాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.nclcil.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 9వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 1వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం రూ.1180 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/మాజీ సైనికోద్యోగులు/దివ్యాంగులకు ఫీజు ఉండదు.
పోస్టుల వివరాలు
డంపింగ్ ఆపరేటర్ (ట్రైయినీ) – 308 పోస్టులు
అర్హత: పదో తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి(ఎస్సీ/ఎస్టీ విభాగాల వారు 45 శాతం). హెవీ మోటార్ వెహికిల్/ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ ఉండాలి.
గ్రేడర్ ఆపరేటర్ (ట్రైయినీ) 34 పోస్టులు
అర్హత: పదో తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి(ఎస్సీ/ఎస్టీ విభాగాల వారు 45 శాతం). హెవీ మోటార్ వెహికిల్/ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ ఉండాలి.
సర్‌ఫేజ్ మైనర్ ఆపరేటర్ (ట్రైయినీ) -43 పోస్టులు
అర్హత: పదో తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి(ఎస్సీ/ఎస్టీ విభాగాల వారు 45 శాతం). హెవీ మోటార్ వెహికిల్/ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ ఉండాలి.
డోజర్ ఆపరేటర్ (ట్రైయినీ)- 52 పోస్టులు
అర్హత: పదో తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి(ఎస్సీ/ఎస్టీ విభాగాల వారు 45 శాతం). హెవీ మోటార్ వెహికిల్/ట్రాన్స్‌పోర్టు లైసెన్స్ ఉండాలి.
స్టాఫ్ నర్స్ (ట్రైయినీ) – 47 పోస్టులు
అర్హత: ఇంటర్, బీఎస్సీ(నర్సింగ్)/ డిప్లొమో ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ పూర్తి చేయాలి. స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదై ఉండాలి.
ఓవర్‌సీర్(సివిల్), టీఅండ్ఎస్ గ్రేడ్ సీ 30 పోస్టులు
అర్హత: పదో తరగతిలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి(ఎస్సీ/ఎస్టీ విభాగాల వారు 45 శాతం). మూడు సంవత్సరాల సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ ఎన్‌సీఎల్‌కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపు ఉంటుంది.