Karan Johar | కరణ్‌జొహార్‌.. ఇది నీకు తగునా? ఠాగూర్‌ను అవమానిస్తావా?

Karan Johar దర్శకుడు కరణ్‌ జొహార్‌పై విమర్శలు రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ ట్రైలర్‌పై రచ్చ ముంబై: రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ సినిమా ట్రైలర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరణ్‌ జొహార్‌ దర్శకత్వం వహించిన 25వ సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో చూపిన ఒక సన్నివేశంలో దేశం గర్వించే కవి, నోబెల్‌ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను అవమానపర్చేలా సంభాషణలు ఉన్నాయని పలువురు ఆగ్రహం […]

  • Publish Date - July 8, 2023 / 03:23 AM IST

Karan Johar

  • దర్శకుడు కరణ్‌ జొహార్‌పై విమర్శలు
  • రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ ట్రైలర్‌పై రచ్చ

ముంబై: రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ సినిమా ట్రైలర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరణ్‌ జొహార్‌ దర్శకత్వం వహించిన 25వ సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో చూపిన ఒక సన్నివేశంలో దేశం గర్వించే కవి, నోబెల్‌ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను అవమానపర్చేలా సంభాషణలు ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందులో రాకీ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌, రాణీ పాత్రను అలియాభట్‌ పోషించారు. వివాదానికి దారి తీసిన సన్నివేశంలో రాణీ ఇంటికి వచ్చిన రాకీ.. అక్కడున్న రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఫొటోను చూసి.. మీ తాతగారా? అని ప్రశ్నిస్తాడు. ఠాగూర్‌పై జోక్‌ పేల్చడం చాలా మందికి ప్రత్యేకించి బెంగాలీలకు నచ్చలేదు. దీంతో వారు కరణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను అవమానించారంటూ సామాజిక మాధ్యమాల్లో మండిపడ్డారు. ట్రైలర్‌ నవ్వులు పూయించేలా ఉన్నప్పటికీ.. ఈ ఫ్రేమ్‌ చూసిన తర్వాత విస్తుపోయాను. ఇది మంచి టేస్ట్‌ కాదు.. అని ఒక యూజర్‌ రాశారు. విలాసవంతమైన సెట్స్‌, ఖరీదైన దుస్తులు చూపిస్తే ఆడియన్స్‌ సరిపోతుందని భావించారేమో అని మరొకరు చురక వేశారు.

పంజాబీలను, బెంగాలీలను మూసపద్ధతిలో చూపించడాన్ని తప్పుపట్టారు. ‘బాలీవుడ్‌ తన గతం నుంచి ఏమీ నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను అలా ఎలా వెక్కిరిస్తారు? గొప్ప మనిషి స్థాయిని కించపర్చడం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు..’ అని ఒక యూజర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు

Latest News