Telangana | CS శాంతికుమారికి కీలక బాధ్యతలు

  • By: sr    news    Apr 28, 2025 4:54 PM IST
Telangana |  CS శాంతికుమారికి కీలక బాధ్యతలు

Telangana |

విధాత: తెలంగాణ సీఎస్ శాంతికుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్ హెచ్ ఆర్డీఐ) వైస్ చైర్మన్ గా నియమిస్తు ప్రభుత్వ కార్యదర్శి ఎం.రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎంసీఆర్ హెచ్ ఆర్డీఐ డైరక్టర్ జనరల్ (ఎఫ్ఏసీ) గా కూడా ప్రభుత్వం శాంతికుమారిని నియమించింది.

ఈ నెలాఖరుతో సీఎస్ గా పదవి కాలం ముగిసిపోతున్న శాంతికుమారి స్థానంలో ఆర్థిక శాఖ కార్యదర్శి కే.రామకృష్ణారావును ప్రభుత్వం నూతన సీఎస్ గా నియమించింది. శాంతికుమారి సేవలను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ నిర్వాహణకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించి తాజాగా ఆమెకు ఆ సంస్థ వైస్ చైర్మన్, డీజీగా బాధ్యతలు అప్పగించింది.