సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నూతన CS రామకృష్ణ

  • By: sr    news    Apr 28, 2025 5:01 PM IST
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నూతన CS రామకృష్ణ

విధాత: తెలంగాణ రాష్ట్రం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామితులైన కే. రామకృష్ణారావు సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్ధరు కొద్ధిసేపు భేటీ అయ్యారు. కే.రామ‌కృష్ణారావు (1991 ఐఏఎస్ బ్యాచ్‌) ప్ర‌స్తుతం ఆర్థిక శాఖ లో ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ప్ర‌స్తుత ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. అదే రోజున రామ‌కృష్ణారావు నూత‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.

ఏపీకి చెందిన రామ‌కృష్ణారావు కు తెలంగాణ‌లో సుధీర్ఘ‌కాలం ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. తెలంగాణ‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాతా ఆర్థిక శాఖ కార్యదర్శిగా తొలి బ‌డ్జెట్ నుంచి తాజా బడ్జెట్ రూపకల్పన వరకు ఆయన కీలకంగా వ్యవహరించారు. రామ‌కృష్ణారావు 2025 ఆగ‌స్టు నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ప్రభుత్వం ఆయన పదవి కాలాన్ని మరో ఆరునెలలు పొడిగించే అవకాశం ఉంది.