Nizamabad : పది రూపాయలకే ప్యాంట్-షర్ట్ ఆఫర్ కోసం ఎగబడ్డ జనం..యజమాని అరెస్టు!
నిజామాబాద్ ఆర్మూర్‌లో ₹10 ప్యాంట్-షర్ట్ ఆఫర్‌తో తొక్కిసలాట, లాఠీచార్జ్.. దుకాణ యజమాని అరెస్టు.

Nizamabad | విధాత : పది రూపాయాలకే ఫ్యాంట్-షర్ట్ ఆఫర్ అంటూ చేసిన ప్రచారం ఆ వస్త్ర దుకాణం యజమానికి మొదటికే మోసం తెచ్చిపెట్టింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మన ఫంకీ బాయ్స్ అనే వస్త్ర దుకాణపు యజమాని పది రూపాయలకే ప్యాంట్-షర్ట్ ఆఫర్ పెట్టాడు. ఇది పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో గురువారం తెల్లవారేసరికల్లా యువతతో పాటు అన్ని వయసుల వారు వేల సంఖ్యలో దుకాణం వద్ధకు తరలివచ్చారు. ట్రాఫిక్ కు సైతం అంతరాయం ఏర్పడింది.
భారీగా వచ్చిన జనంతో అక్కడ తొక్కిసలాట సాగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేయడంతో అంతా ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ సమస్యకు కారణమైన యజమానిపై కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. తానేదో బిజినెస్ పెంచుకునే ఆలోచనతో పది రూపాయాలకే ఫ్యాంట్-షర్ట్ ఆఫర్ పెడితే చివరకు అది నన్ను కేసుల పాలు చేసిందంటూ యజమాని వాపోయాడు.
ఇవి కూడా చదవండి…
నాపై కక్ష కట్టారు.. బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 240 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఆఫర్ తెచ్చిన తంటా
పది రూపాయలకే ప్యాంట్ & షర్ట్ ఆఫర్
భారీగా ఎగబడ్డ జనం.. ట్రాఫిక్‌కు అంతరాయం
పోలీసుల అదుపులో షాపు యజమాని
కేసు నమోదు చేసిన పోలీసులు#Nizamabad #PantShirtOffer #Telangana #TrafficJam pic.twitter.com/ODkIJDuy1V
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 21, 2025