Telangana | సచివాలయంలో భద్రతా వైఫల్యం.. మంత్రుల సమావేశంలో నకిలీ ఉద్యోగులు

Telangana |
విధాత : తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో నిర్వహిస్తున్న సమావేశంలోకి ఇద్దరు నకిలీ ఉద్యోగులు వెళ్లినట్లుగా సమాచారం. ఆరో ఫ్లోర్‌కు వెళ్లేందుకు నకిలీ ఉద్యోగులు ప్రయత్నించారని తెలుస్తుంది.
అయితే నకిలీ ఉద్యోగుల సమాచారం బయటకు రాకుండా సచివాలయం పోలీస్ సిబ్బంది దాచిపెడుతున్నారని పలువురు సచివాలయ అధికారుల కథనం. సెక్యూరిటీ వైఫల్యం వల్లే తరచూ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు ఫేక్ ఐడీ కార్డులతో హల్చల్ చేస్తున్నారు.
గతంలో కూడా ఇద్దరు ఫేక్ ఐడి కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదేరకమైన వ్యవహారం చోటుచేసుకోవడంతో సెక్యూరిటీ విభాగం అప్రమత్తమైంది. సచివాలయంలో సీఎం, మంత్రుల సమావేశాల్లోనూ నకిలీ ఉద్యోగులు ప్రవేశించడం పట్ల మంత్రులు భద్రతాధికారులపై సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది.