Pan - Aadhaar Link | విధాత: ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మరో ఐదురోజుల్లో ముగియనున్నది. మార్చి 31తో కీలకమైన ఐదు పనులకు సైతం గడువు తీరనున్నది. ఇందులో పాన్ - ఆధార్ కార్డ్ లింక్ ఒకటి. ఇప్పటి వరకు పాన్ - ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే చేసుకోండి. చేసినా మరోసారి వేరిఫై చేసుకోండి. పాన్ - ఆధార్ అనుసంధానం చేయకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీ పాన్ కార్డ్ చెల్లదని కేంద్రం […]
Pan – Aadhaar Link |
విధాత: ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం మరో ఐదురోజుల్లో ముగియనున్నది. మార్చి 31తో కీలకమైన ఐదు పనులకు సైతం గడువు తీరనున్నది. ఇందులో పాన్ – ఆధార్ కార్డ్ లింక్ ఒకటి. ఇప్పటి వరకు పాన్ – ఆధార్ లింక్ చేయకపోతే వెంటనే చేసుకోండి. చేసినా మరోసారి వేరిఫై చేసుకోండి.
పాన్ – ఆధార్ అనుసంధానం చేయకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీ పాన్ కార్డ్ చెల్లదని కేంద్రం తెలిపింది. అనంతరం ఆ తేదీని జూన్ 30 వరకు గడువును పెంచింది. ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డ్ కీలకమైందని అందరికీ తెలిసిన విషయమే. ఓ వ్యక్తికి ప్రత్యేక గుర్తింపుగా ఇది పని చేస్తుంది.
PAN – Aadhaar Link: ఆధార్‌తో.. పాన్ కార్డ్ లింక్! డెడ్‌లైన్ జూన్ 30 వరకు పొడిగింపు
అదే సమయంలో పాన్ లేకపోతే ఇకపై ఎక్కువగా పన్నులు చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. రూ.50వేల కంటే ఎక్కువగా లావాదేవీలు చేయలేరు. అదే సమయంలో పలు ఇబ్బందులను సైతం ఎదుర్కోవాల్సి రానున్నది.
అదే సమయంలో మరింత టీడీఎస్ చెల్లించాల్సి రావడంతో పాటు తగ్గించిన టీడీఎస్‌ను క్లెయిమ్ చేసుకోవడంలో తిప్పలు తప్పకపోవడంతో పాటు బ్యాంకు ఖాతాలో జమ కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తప్పనిసరిగా జూన్ 30, 2023 తేదీలోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోండి. లేకపోతే పది కీలకమైన పనులు నిలిచిపోతాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం రండి మరి..!