విధాత‌: Pan-Aadhar | పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయడానికి గడువును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (CBDT) పొడించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పన్ను చెల్లింపుదారులకు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానించేందుకు మరింత సమయం ఇచ్చినట్లు తెలిపింది. తప్పనిసరిగా జూన్‌ 30 వరకు లింక్‌ చేసుకోవాలని కోరింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో గడువు ముగినుండగా మరోసారి పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత ముగిసిన తర్వాత రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని […]

విధాత‌: Pan-Aadhar | పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయడానికి గడువును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (CBDT) పొడించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పన్ను చెల్లింపుదారులకు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానించేందుకు మరింత సమయం ఇచ్చినట్లు తెలిపింది. తప్పనిసరిగా జూన్‌ 30 వరకు లింక్‌ చేసుకోవాలని కోరింది.

వాస్తవానికి ఈ నెలాఖరుతో గడువు ముగినుండగా మరోసారి పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత ముగిసిన తర్వాత రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. గడువు ముగిసిన తర్వాత అంటే జూలై ఒకటో తేదీ నుంచి పాన్‌ పని చేయదని సీబీడీటీ స్పష్టం చేసింది. పాన్‌తో ఆధార్‌ లింక్‌ చేయని పక్షంలో.. పాన్‌ పని చేయని కాలానికి వడ్డీ చెల్లించబడదని పేర్కొంది.

వేతన జీవులు ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయాలన్నా, ఇల్లు, బిజినెస్, పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలనుకున్నా, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేయాలన్నా, బ్యాంకుల్లో సేవింగ్స్‌ ఖాతా లేదా డీమ్యాట్‌ ఖాతా ఓపెన్‌ చేయాలన్నా ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం పాన్‌ తప్పనిసరి. 2010లో ఆధార్‌ అమల్లోకి రావడంతో ప్రతి పాన్‌ కార్డు హోల్డర్‌, తన ఆర్థిక లావాదేవీల కోసం తప్పనిసరిగా ఆధార్‌ కార్డుతో అనుసంధానించాలి ఉంటుంది. గడువు ముగిసినా రూ.1000 ఫైన్‌తో సీబీడీటీ అవకాశం ఇచ్చింది.

Updated On 25 April 2023 1:10 PM GMT
Somu

Somu

Next Story