ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్

రాజకీయ ప్రత్యర్థులైన కంగనా, సుప్రియా, మహువా ఒకే వేదికపై డాన్స్ చేస్తూ జిందాల్ కుమార్తె సంగీత్ వేడుకలో సందడి చేశారు.

ఆ మహిళా ఎంపీలు రాజకీయ ప్రత్యర్థులు..ఒకే వేదికపై డాన్స్

న్యూఢిల్లీ : ఆ ముగ్గురు మహిళా ఎంపీలు..వారి పార్టీలలో ఫైర్ బ్రాండ్ నాయికమణులే. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకపడటంలో ఎవరికెవరు తీసిపోరు. అనూహ్యంగా ఆ ముగ్గురు ఒకే వేదికపై డాన్స్ చేశారు. ఇందుకు పారిశ్రామిక వేత్త, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె వివాహ వేడుక వేదికైంది.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎన్‌సీపీఎస్పీ ఎంపీ సుప్రియా సులే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లు తమ రాజకీయాలను కాసేపు పక్కన బెట్టి పెళ్లి వేడుకలో చిందేశారు. బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె వివాహం సంగీత్ వేడుకలో కలిసి వారు వేదికపై కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు. ముగ్గురు మహిళా ఎంపీలు కలిసి జిందాల్ కుమార్తె సంగీత్ లో ‘ఓం శాంతి ఓం’ పాటకు స్టెప్పులు వేయడం ఈ పెళ్లి వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది. ఇందుకోసం వారు కలిసి ముందస్తుగా ప్రాక్టీస్ కూడా చేయడం విశేషం.

దేశంలోని బడా పారిశ్రామిక వేత్తలలో ఒకరైన..బిలియనీర్ నవీన్ జిందాల్ కుమార్తెయశస్విని జిందాల్ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకను భారీ ఈవెంట్ మాదిరిగా నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో వధూవరులు హైలైట్ గా నిలిచారు.ఈ వేడుకల్లో భాగంగా, జిందాల్ కుటుంబానికి చెందిన నలుగురు సోదరులు.. సజ్జన్, రతన్, నవీన్, పృథ్వీ రాజ్ జిందాల్ కలిసి ఉల్లాసంగా నృత్యం చేశారు.

జిందాల్ అల్లుడు శాశ్వత్ సోమనీ కూడా పారిశ్రామిక నేపథ్యం నుంచే వచ్చారు. ఆయన సోమనీ ఇంప్రెసా లిమిటెడ్ చైర్మన్, ఎండీ అయిన సందీప్, సుమితా సోమనీల కుమారుడు. వీళ్లకి గ్లాస్, శానిటరీవేర్ రంగంలో బిజినెస్ లు ఉన్నాయి. ప్రస్తుతం శాశ్వత్ సోమనీ.. సోమనీ గ్రూప్‌లో ‘హెడ్ ఆఫ్ స్ట్రాటజీ’గా వ్యవహరిస్తూ కుటుంబ వ్యాపారంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Tirupati : తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో కీచక పర్వం
వికసిత్ భారత్ పేరుతో… కార్పొరేట్ మనువాది భారత్ నిర్మాణం