Harihara Veeramallu| అయ్యయ్యో వీరమల్లు
ఆరేళ్ల క్రితం శ్రీకారం చుట్టుకున్న సినిమా హరిహర వీరమల్లు ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. జూలై 24 సరిగ్గా 27ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలైన తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మళ్లీ ఇదే రోజు పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత విడుదలైన తొలి మూవీగా హరిహర వీరమల్లు నిలిచింది.

Harihara Veeramallu
విధాత: ఆరేళ్ల క్రితం శ్రీకారం చుట్టుకున్న సినిమా హరిహర వీరమల్లు ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. జూలై 24 సరిగ్గా 27ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలైన తొలి ప్రేమ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మళ్లీ ఇదే రోజు పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత విడుదలైన తొలి మూవీగా హరిహర వీరమల్లు నిలిచింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే ఓ పిల్లాడు నీటి ప్రవాహంలో తేలుతూ వస్తూ అగ్రహారం వాసులకు దొరుకుతాడు. ఆ పిల్లాడికి వీరమల్లు అని నామకరణం చేస్తారు. వీరమల్లు పెరిగి పెద్దయ్యాక వజ్రాల దొంగగా మారుతాడు. గోల్కొండ నవాబు అతనికి ఔరంగజేబు వద్ద ఉన్న కొహినూర్ వజ్రాన్ని దొంగలించమని చెబుతాడు. అలా కిరాయి దొంగలా బయలుదేరిన వీరమల్లు ఎక్కడివరకు చేరకుంటాడనేది మిగతా కథ. అయితే ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం అంతంతమాత్రంగానే ఉందని సినీ విమర్శకులు అంటున్నారు.
ఎక్కడ లోపించింది?
దర్శకత్వం విషయంలో డైరెక్టర్ జ్యోతి కృష్ణ పవన్ లాంటి స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేకపోయాడని, అందుకే ఈ విధంగా ఉందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. చిత్రంలోని కోర్ ఎమోషన్ సరిగ్గా పండలేదని దీంతో ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్ కాలేకపోయారని చెప్పవచ్చు. వీఎఫెక్స్ విషయానికి వస్తే అంతగా సెట్ అవ్వలేకపోయాయని తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ చాలా నిదానంగా సాగడం వంటి విషయాలు అభిమానులను తీవ్ర నిరాశపరిచాయని చెప్పవచ్చు.
ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కొందరు ప్రేక్షకులు తమదైన రీతిలో రివ్యూ ఇచ్చారు. ఔరంగజేబుకు వీరమల్లు వార్నింగ్ ఇచ్చే సన్నివేశం చాలా కామెడీగా ఉందంటూ కామెంట్ చేశారు. మరొకరూ ఎక్స్‌లో స్పందిస్తూ కథ పేవలంగా ఉందని, దాన్ని తెరకెక్కించడంలో విఫలమయ్యారని రాసుకొచ్చారు. కీరవాణీ అందించిన బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ బాగుందని, కానీ మునిగిపోతున్న పడవలాంటి కథను మ్యూజిక్ ఒక్కటే నిలబెట్టడం చాల కష్టమని మరొకరు వెల్లడించారు.
కథలోనే ఎన్నో తప్పులు ఉన్నాయని, హరిహరవీరమల్లు చనిపోయింది 1355, ఔరంగజేబు పుట్టింది 1618, చార్మినార్ నిర్మించింది 1591 కథలో ఇన్ని తప్పులున్నాయని, కేవలం మత విద్వేషమే ఈ సినిమా లక్ష్యమని పేర్కొంటున్నారు.