Perni Nani | బాలకృష్ణపై పేర్ని నాని ఫైర్
బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ ఫైర్; చిరంజీవి అభిమానులు కూడా కౌంటర్ ఎటాక్.

అమరావతి : అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ పైన, మెగాస్టార్ చిరంజీవిపైన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, చిరంజీవి అభిమానులు కౌంటర్ ఎటాక్ లతో విరుచుక పడుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు బొత్స సత్యానారాయణ, పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్, జోగి రమేష్ లు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు వేర్వేరుగా మీడియా సమావేశాల్లో స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
శుక్రవారం బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ సభా సాంప్రదాయాలకు విరుద్దంగా మాజీ సీఎం జగన్ ను, మాజీ కేంద్ర మంత్రి చిరంజవిని బాలకృష్ణ అవమానించడంపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను డిమాండ్ చేశారు. చిరంజీవిని విమర్శిస్తుంటే జనసేన ఎందుకు స్పందించడంలేదో వారికే తెలియాలన్నారు. పేర్ని నాని మాట్లాడుతూ బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమైందా? అంటూ మండిపడ్డారు. అసెంబ్లీలో బాలకృష్ణ లాంటి వారి కోసం బ్రీత్ అనలైజర్ పెట్టాలని.. తప్పతాగి, కళ్లు నెత్తికెక్కి బాలకృష్ణ మాట్లాడుతున్నాడని..మందు వేస్తే బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని విమర్శించారు. అసెంబ్లీకి మెన్షన్ హౌజ్ తాగి వచ్చినట్లున్నాడని ఎద్దేవా చేశారు.
చిరంజీవిని కామినేని శ్రీనివాస్ పొడిగితే బాలకృష్ణ ఉండబట్టలేకపోయాడని… సైకో బుద్దులు, సైకో ఆలోచనలు బాలకృష్ణవేనన్నారు. అఖండ సినిమా టిక్కెట్లు రేట్లు పెంచుకుంటాం జగన్ అపాయిట్మెంట్ కావాలని బాలకృష్ణ వైసీపీ హయాంలో నాకు ఫోన్ చేసి అడిగాడు అని గుర్తు చేశారు. నాకు ఫోన్ చేయలేదని బాలకృష్ణ వాళ్ల తల్లితండ్రుల మీద ఒట్టేసి చెప్పగలవా అని…నేను నా తల్లిదండ్రులపై ఒట్టేసి చెబుతానన్నారు.
చిరంజీవిని సొంత అన్నలా వైఎస్ జగన్ చూసుకున్నారన్నారని.. చిరంజీవి ఆనాడే లేఖ రాసి ఉంటే పవన్ కల్యాణ్ నోరు కూడా మూత పడేదన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి తక్షణం స్పందించడాన్ని వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తుందన్నారు. వైఎస్ జగన్ హయాం నాటి జీవోనే కూటమి పాలకులు కొనసాగిస్తున్నారని చెప్పారు. సినిమా పేదోడికి దగ్గరగా ఉండాలని ఆరోజు మీటింగ్‌లో వైఎస్ జగన్ చెప్పారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ సాయం చేయకపోతే బాలకృష్ణకు ఆనాడు జీవిత ఖైదు పడేది అని గుర్తు చేశారు. చంద్రబాబు హయంలో క్యాన్సర్ ఆసుపత్రి బిల్లులు ఆగిపోయాయని బాలయ్య చెప్పారని గుర్తు చేశారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ మద్యం సేవించి అసెంబ్లీలో రెచ్చిపోయాడన్నారు. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న బాలకృష్ణను అసెంబ్లీలోకి అనుమతించవద్దన్నారు. ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటనలో జైలులో చిప్పకూడు తినాల్సిన బాలయ్య వైఎస్సార్ పుణ్యమా అని ఇప్పుడిలా ఉన్నాడన్నారు.