బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) రీసెంట్‌గా హీరోయున్‌గా నటించిన కొత్త బాలీవుడ్ చిత్రం దేవ (Deva). షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా నటించగా మలయాళ చిత్రం ముంబై పోలీస్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గత నెల చివరలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అశించిన విజయం సాధించడంలో విఫలమైంది. కనీ షౄహిత్ కపూర్ , పూజాల మధ్చ చిత్రీకరించిన ఓ రొమాంటిక్ సాంగ్ మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇటీవల ఈ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేయగా మంచి వ్యూస్ దక్కించుకుంటుంది.
అయితే తెలుగులో చివరగా ఆచార్య సినిమాలో నటించినపూజా హెగ్డే ఆ తర్వాత F3 సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆపై మరే తెలుగు చిత్రాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో విజయ్, సూర్య వంటి స్టార్ హీరోల చిత్రాలు, బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తోంది. గత కొంతకాలంగా ఎలాంటి హంగామా లేకుంగా , సోషల్ మీడియాలోనూ అంతగా కనపించని ఈ ముద్దగుమ్మ దేవ (Deva) సినిమా విడుదల అనంతరం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అమ్మడి పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం మూవీలో ఘాటైన ముద్దు సన్నివేశంలో నటించడమే.
సినిమాల్లోకి పుష్కర కాలం పూర్తి చేసుకున్న పూజా హెగ్డే ఏనాడు ఏ సినిమాలో శృతి మించి అందాల ప్రదర్శణ చేసింది లేదు. హృతిక్ రోషన్ మొహంజదారో, అఖిల్ బ్యాచ్‌లర్ సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించింది కానీ ప్రాచుర్యం దక్కించుకోలేదు. ఇటీవల విడుదలైన దేవ సినిమాలో పూజా హెగ్డే (Pooja Hegde).. షాహిద్ కపూర్ (Shahid Kapoor) తో నిమిషానికి పైగా సుధీర్ఘంగా సాగించిన ఘాటైన అదర చుంబనం సన్నివేశం చూసి ప్రేక్షకులు అశ్చర్యపోతున్నారు.