Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్.. హిట్‌కొట్టేలానే ఉన్నాడే

Akkada Ammayi Ikkada Abbayi Trailer:
యాంకర్ ప్రదీప్ (Pradeep Machiraju) హీరోగా నటిస్తున్న రెండో చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi). మరో యాంకర్ దీపికి పిల్లి (Deepika Pilli) కథానాయిక. ఈటీవీ జబర్ధస్త్, పటాస్ వంటి ఈవెంట్లతో మంచి పేరు సంపాదించుకున్న నితిన్ (Nitin), భరత్ (Bharath) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పాటలు విశేష స్పందనను దక్కించుకున్నాయి. ఏప్రిల్11న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ప్రదీప్ అమ్మ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ను చూస్తే సినిమాలో ఏదో విశేషం ఉందనేలానే ఉంది. ట్రైలర్ ఆద్యంతం మంచి కామెడీ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కట్ చేశారు. సత్య పంచులు అదిరిపేయేలా ఉన్నాయి.