Site icon vidhaatha

Prakashraj: పర్యావరణ విధ్వంసం ఆమోద యోగ్యం కాదు

హెచ్ సీయు భూముల వివాదంపై ప్రకాశ్ రాజ్ ఫైర్
విధాత: హెచ్ సీయూ భూముల వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా తన వైఖరి వెల్లడించారు. హెచ్ సీయూ భూముల్లో పర్యావరణ విధ్వంసం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని ట్వీట్ చేశారు. ఈ వివాదంలో విద్యార్థులు, ప్రజలు, నటులు వ్యక్తం చేస్తున్న ఆందోళనకు తన సంఘీభావం తెలిపారు.

మన భవిష్యత్తు కోసం ఈ నిరసనను షేర్ చేసి మరింత విస్తృతం చేయవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. హెచ్ సీయూ భూముల వివాదంలో ఇప్పటికే దర్శకుడు నాగవంశీ సహా పలువురు సినీ రంగ సెలబ్రెటీలు పర్యావరణ పరిరక్షణ కోణంలో విద్యార్థుల ఆందోళనకు మద్ధతు పలకడం గమనార్హం.

Exit mobile version