Priyanka Chopra: ఆ.. అనుభూతి ఎక్క‌డా రాదు

  • By: sr    news    Jan 06, 2025 6:37 PM IST
Priyanka Chopra: ఆ.. అనుభూతి ఎక్క‌డా రాదు

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి వ‌రుస భారీ సినిమాల‌తో దూసుకుపోతోంది ప్రియాంకా చోప్రా (Priyanka Chopra). తాజాగా షారుఖ్ ఖాన్‌తో ఉన్న రిలేష‌న్‌పై ఓపెన్ అయి బాంబు పేల్చిన ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఓటీటీలు, థియేటర్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘ఈ రెండూ కూడా ప్రేక్షకులకు వంద శాతం వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే బిగ్ స్క్రీన్‌పై అనుభూతి ఓటీటీలో రాదు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అనేది దేనికీ సాటిరాదు. థియేటర్‌లో చిన్న శబ్దం కూడా ఆస్వాదించవచ్చు.

ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలను శ్రద్ధగా చూడలేం. అందుకే ఎన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చినా, థియేటర్ డిమాండ్ ఎన్నటికీ తగ్గదు. రోజురోజుకూ పెరిగిపోతున్న త్రీడీ, ఏఐ టెక్నాలజీలను అందిపుచ్చుకుని ప్రేక్షకులను మరింత దగ్గరగా థియేటర్లు ఆకర్షిస్తున్నాయి’ అని చెప్పుకొచ్చింది.

హాలీవుడ్ సినిమాలే ఎక్కువగా చేస్తున్న ప్రియాంక త్వరలోనే బాలీవుడ్ సినిమాలు చేస్తానని చెప్పింది. అంతేకాదు రాజ‌మౌళి మ‌హేశ్‌బాబు చిత్రంలోనూ న‌టిస్తున్న‌ట్లు ఈ మ‌ధ్య వార్త‌లు సైతం వ‌చ్చాయి.