Mahesh Babu | రాజమౌళి సినిమా కోసం రన్నింగ్ స్టైల్ కూడా మార్చిన మహేష్ బాబు.. ‘వారణాసి’పై అంచనాలు రెట్టింపు
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్‌గా పెట్టుకుని దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్‌గా పెట్టుకుని దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాలు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌ను కూడా గ్లోబల్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్న రాజమౌళి, హాలీవుడ్ మీడియాతో ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ‘వారణాసి’ గ్లింప్స్ విడుదల సమయంలో రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఆ ఇంటర్వ్యూ విడుదల కావడంతో అందులో మహేష్ బాబు చెప్పిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు మాట్లాడుతూ రాజమౌళి పని తీరు గురించి ప్రత్యేకంగా వివరించారు. “రాజమౌళి గారికి ఒక ప్రత్యేకమైన మెథడ్, ప్రాసెస్ ఉంటుంది. షూటింగ్‌కు ముందే రిహార్సిల్స్‌ను కూడా సినిమాటోగ్రాఫర్‌తో షూట్ చేస్తారు. అందువల్ల అసలు షూటింగ్ టైంలో చాలా ఈజీగా ఉంటుంది. ఒక స్టూడియోలో నెలల తరబడి ప్రాక్టీస్ చేశాం. నా క్యారెక్టర్‌కు సంబంధించిన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటారు” అని చెప్పారు.
ఈ సినిమా కోసం తీసుకున్న ట్రైనింగ్ గురించిన విషయాలు కూడా మహేష్ వెల్లడించారు. “రెండు మూడు నెలలు కలరిపయట్టు ట్రైనింగ్ తీసుకున్నాను. అంతేకాదు, నా రన్నింగ్ టెక్నిక్‌ని కూడా రాజమౌళి మార్చేశారు. ట్రాక్ ఫీల్డ్‌లో ఆ స్టైల్ కోసం ఆరు నెలలు ప్రాక్టీస్ చేశాను. సినిమాలో అవి కేవలం రెండు షాట్స్ మాత్రమే ఉన్నా, ఆయన కమిట్‌మెంట్ అలాంటిది” అని తెలిపారు. యాక్షన్ సన్నివేశాల్లో గాయాలు తగ్గేందుకు, పెర్ఫెక్షన్ కోసం ఈ రిహార్సిల్స్ ఎంతో ఉపయోగపడతాయని మహేష్ చెప్పడం విశేషం.
షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనను కూడా ఆయన గుర్తు చేశారు. “ఒకసారి ఫ్యామిలీతో జర్మనీ ట్రిప్‌కి వెళ్లినప్పుడు కూడా రోడ్డుపై వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్కడి వాళ్లు ఆశ్చర్యంగా చూసారు. కానీ ఆ ప్రాక్టీస్‌లు షూటింగ్‌లో బాగా పనికొచ్చాయి” అని నవ్వుతూ చెప్పారు. ఇకపై తన తదుపరి సినిమాల్లో కూడా రిహార్సిల్స్ కోరుకుంటానని మహేష్ స్పష్టం చేశారు.
మహేష్ బాబు రన్నింగ్ స్టైల్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. పోకిరి, మహర్షి, వన్ నేనొక్కడినే వంటి చిత్రాల్లో ఆయన రన్నింగ్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాంటి స్టైల్‌ను కూడా రాజమౌళి మార్చేశారని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొత్తగా మహేష్‌ను రాజమౌళి ఎలా చూపిస్తాడో, ఆయన రూపొందించిన కొత్త లుక్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ‘వారణాసి’ సినిమా విడుదలకు ముందే ఈ ఇంటర్వ్యూతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram