Rains | తెలంగాణలో.. రెండు రోజులు వర్షాలు!

  • By: sr    news    Apr 09, 2025 5:31 PM IST
Rains | తెలంగాణలో.. రెండు రోజులు వర్షాలు!

విధాత: క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఈ రెండు రోజులు కూడా గరిష్ఠ ఉష్ణోగత్రలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరుగనుందని పేర్కొంది.

గురువారం, శుక్రవారాల్లో ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌ జారీ చేసింది.