Robo Dog: IPLలో.. రోబో డాగ్ సందడి..!

విధాత: క్రికెట్ అభిమానులకు భారీ పండుగ భావించే ఐపీఎల్ 2025టోర్నీ ఉత్కంఠభరిత మ్యాచ్ లతో వారిని అలరిస్తూ కనువిందు చేస్తుంది. ధనాధనా షాట్లతో సిక్స్ లు, ఫోర్లతో విరుచుక పడుతున్నబ్యాటర్లు, ఇంపాక్ట్ ప్లేయర్ల ట్విస్టులు.. మధ్యలో చీర్ గర్ల్ డాన్స్ లు..ప్రేక్షకుల కేరింతలతో కలర్ ఫుల్ గా ఐపీఎల్ మ్యాచ్ లు సాగిపోతున్నాయి.
తాజాగా ఐపీఎల్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు బీసీసీఐ ఓ సరికొత్త ప్రయోగం చేసింది. ఆటలో మాత్రం కాదండోయ్. మైదానంలో ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లను పలకరించేందుకు ఏఐ రోబో డాగ్ ను ప్రవేశపెట్టింది. నిన్న ముంబై, ఢిల్లీ మ్యాచ్ కు ముందు ప్రాక్టిస్ సమయంలో ఈ రోబో డాగ్ (Robo Dog) ప్లేయర్లను పలకరించింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏఐ రోబో డాగ్ తన బుడిబుడి అడుగులతో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలకు షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు కామెంటేటర్ మారిసన్ వాయిస్ కమాండ్ లకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఆటగాళ్లను అలరించింది. అది చూసిన ప్రేక్షకులు సైతం కేరింతలతో ఎంజాయ్ చేశారు.