ఉపాధి హామీకి రూ.2708.3 కోట్లు మంజూరు

విధాత : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 6.5 కోట్ల పనిదినాలు లక్ష్యంగా రూ.2708.3 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉపాధి హమీలో కొత్త ప్రణాళికలకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆమోదం తెలిపింది. జిల్లాల వారీగా పనుల కార్యాచరణ సిద్ధం చేశారు. వేతనాలకు రూ.1625 కోట్లు, మెటీరియల్‌కు రూ.1083 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా, పోలం బాటలు, ఫల వనాలు, వనమహోత్సవం, జలనిధి, గ్రామీణ పారిశుద్ధ్యం వంటి పనులు త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు.