గాలికి వదిలేసిన కెపాసిటీ రూల్.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం!
సామాన్య ప్రజలకు తమ గమ్యస్థానానికి చేర్చడంలో కీలకపాత్ర పోషించేది ఏ మాత్రం సందేహం లేకుండా ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్సులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు
విధాత, హైదరాబాద్ : సామాన్య ప్రజలకు తమ గమ్యస్థానానికి చేర్చడంలో కీలకపాత్ర పోషించేది ఏ మాత్రం సందేహం లేకుండా ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (RTC) బస్సులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా వ్యవస్థలో రవాణాలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ, వాటిలోని భద్రతా ప్రమాణాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే, ప్రమాదం జరిగినప్పుడు మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్య పెరగానికి ప్రధాన కారణం మాత్రం బస్సులో కెపాసిటికి మించి ప్రయాణికులు ఎక్కడమేనని అందరకి తెలిసిన విషయమే.. ఇది ప్రమాదాన్ని మరింత జఠిలంగా మార్చి ప్రాణ నష్టా్న్ని పెంచుతోంది.
అయితే, సహజంగా దేనికైనా లిమిట్ ఉంటుంది. అలాగే, ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల కెపాసిటి రూల్ కూడా ఉంటుంది. ఈ విషయం మనలో చాలా మందికి తెలియకపోవచ్చు.. కొందరికి తెలిసినా పట్టించుకోరు. ఆర్టీసీ బస్సులో కెపాసిటీ రూల్స్ స్పష్టంగా ఉన్నా.. వాటిని అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే వాదనలు ఉన్నాయి. మోటార్ వెహికిల్స్ యాక్ట్, 1988 ప్రకారం ప్రతి బస్సుకూ సీటింగ్ కెపాసిటీ, నిలబడే ప్రయాణికుల పరిమితి నిర్ణయించబడి ఉండాలనే రూల్ ఉంది. దీనికి సంబంధించిన వివరాలు బస్సుకు సంబంధించిన ఆర్‌సీ(RC) పొందుపరుస్తారు.
కాగా, ప్రైవేట్ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికులు ఉంటే ఆర్టీఏ అధికారులు ఫైన్లు విధిస్తారు. కానీ, ఆర్టీసీ బస్సుల్లో మాత్రం నిబంధనలకు విరుద్దంగా సీటింగ్ కెపాసిటి రూల్ ను తుంగలో తొక్కుతున్నారు. ఉదాహరణకు పల్లెవెలుగు బస్సులకు 45–48 సీట్లు ఉంటే నిలబడి ప్రయాణించేందుకు గరిష్టంగా 10–15 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ, దీనికి ఏ మాత్రం సంబంధం లేకుండా లెక్కు మించి బస్సు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిన బస్సులను మనం ఎన్నోసార్లు చూస్తాం. ముఖ్యంగా పండుగలు ఉన్న సందర్భాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. జనం ఊపిరితీసుకోలేని విధంగా కూడా ప్యాసెంజర్లను ఎక్కించుకుని ప్రయాణించిన బస్సులు లేకపోలేదు. ఓవర్‌లోడింగ్ వల్ల బస్సు స్థిరత్వం తగ్గి బ్రేకుల వ్యవస్థ, టైర్లు, సస్పెన్షన్ దెబ్బతింటాయి. దీని వల్ల చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశాలు లేకపోలేదు.
అయితే, కెపాసిటీ లిమిట్ ఉన్నా.. దానిని అధికారులు అమలు చేయడం లేదనే వాదనలు ఉన్నాయి. మరోవైపు బస్సుల కొరత, ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరగడం కూడా దీనికి కారణంగా ఉంది. కాగా, అసలు ఆర్టీసీకి ఓవర్ లోడ్ పరిమితి ఉందా? అనేది ఇప్పుడు చాలా మందిలో రేకెత్తున్న ప్రశ్న. ఆర్టీసీ యాజమాన్యం సరైన చర్యలు తీసుకుని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram