ఘోర బస్సుప్రమాదం.. 42 మంది సజీవదహనం

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మక్కా యాత్రకు 44 మంది వెళ్లారు. వీరంతా బస్సులో మక్కా నుంచి మదీనా వెళుతుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం అవ్వడంతో బస్సులో ఉన్న 42 మంది సజీవదహనం అయినట్లు సమాచారం.

  • By: Subbu |    news |    Published on : Nov 17, 2025 12:08 PM IST
ఘోర బస్సుప్రమాదం.. 42 మంది సజీవదహనం

విధాత: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మక్కా యాత్రకు 44 మంది వెళ్లారు. వీరంతా బస్సులో మక్కా నుంచి మదీనా వెళుతుండగా డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం అవ్వడంతో బస్సులో ఉన్న 42 మంది సజీవదహనం అయినట్లు సమాచారం.

కాగా ఈ బస్సులో అత్యధికులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తింపు. ఆల్‌ మక్కా ట్రావెల్స్‌ నుంచి 20 మంది, ఫ్లై జోన్‌ ట్రావెల్స్‌ నుంచి 24 మంది. మక్కా యాత్రకు వెళ్లారు. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్‌ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది. యాత్రికులు హైదరాబాద్‌ అసిఫ్‌నగర్‌, జిర్రా, హబీబ్‌నగర్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.