SIKANDAR Trailer: స‌ల్లూభాయ్ ఈ సారి గ‌ట్టిగానే ఫ్లాన్ చేశాడుగా.. సికంద‌ర్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది!

  • By: sr    news    Mar 23, 2025 6:47 PM IST
SIKANDAR Trailer: స‌ల్లూభాయ్ ఈ సారి గ‌ట్టిగానే ఫ్లాన్ చేశాడుగా.. సికంద‌ర్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది!

SIKANDAR Official Trailer

బాలీవుడ్ మెగాస్టార్ స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) న‌టించిన నూత‌న చిత్రం సికంద‌ర్ (Sikandar). త‌మిళ అగ్ర ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్ (A.R. Murugadoss) ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోండ‌గా అగ్ర నిర్మాత సాజిద్ న‌డియావాలా (Sajid Nadiadwala) నిర్మించారు. ఈ సినిమా మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) క‌థానాయిక‌గా న‌టించింది. స‌త్య‌రాజ్ (Sathyaraj) కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

గ‌త కొంత కాలంగా త‌న ఇమేజ్‌కు త‌గిన‌ట్లు స‌రైన స‌క్సెస్‌లు లేని స‌ల్మాన్ ఖాన్ మంచి హిట్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. గతేడాది కిసీ కా భాయ్ కిసీ కి జాన్, టైగర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు అభిమానుల‌ని ఏ మాత్రం అల‌రించ‌లేక‌పోయాయి. దీంతో ఈ సారి చేయ‌బోయే సినిమాతో అయిన పెద్ద హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు స‌ల్లూభాయ్.

స‌ల్మాన్- మురుగ‌దాస్ కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నదియావాలా అత్యంత భారీ బడ్జెట్‌తో అంటే దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అదేవిధంగా గజిని, తుపాకీ, స్టాలిన్, 7th సెన్స్ వంటి సినిమాలను తెరకెక్కించి స్టార్ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు మురుగదాస్. ఆ తర్వాత ఆయ‌న‌ మహేశ్ బాబుతో స్పైడర్, రజనీకాంత్‌తో దర్బార్ సినిమాలను తెరక్కించాడు. కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమయిన ఈ డైరెక్ట‌ర్ ఇప్పుడు మళ్లీ ఇప్పుడు కొత్త కథలతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి తిరిగి ఫామ్‌లోకి రావాల‌ని అనుకుంటున్నాడు.