Subham: సమంత కొత్త జర్నీ.. ఫస్ట్ నైట్ రోజు సీరియల్ ఏంటి ‘శుభం’ టీజర్ అదిరింది

Subham:
విధాత: సౌత్ ఇండియా సూపర్‌స్టార్ సమంత (Samantha) ఇటీవల సినిమాల్లో నటనకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన ఆమె నిర్మాతగా కొత్త అవతరం ధరించి ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ (TralalaMovingPictures) బ్యానర్‌పై శుభం (Subham) (చచ్చినా చూడిల్సిందే) అనే సినిమాను నిర్మించింది. హర్షిత్ రెడ్డి (Harshith Reddy), శ్రీయ కొంతం(Shriya Kontham) (నాని గ్యాంగ్ లీడర్ ఫేం) జంటగా నటించారు. గవిరెడ్డి శ్రీను, చరణ్ పేరి, శ్రావణి లక్ష్మి శాలిని కొండేపూడి ఇతర పాత్రల్లో నటించారు. క్లింటన్ సెరెజో (Clinton Cerejo) ఈ సినిమాకు సంగీతం అందించగా వివేక్ సాగర్ (Vivek Sagar) బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు.
తాజాగా సోమవారం రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ, కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించానట్లు అర్థమవుతోంది. గతంలో సినిమా బండి (Cinema Bandi) అనే సినిమాను డైరెక్ట్ చేసిన ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. మరో వైపు ప్రముఖ కథానాయికలు అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran), దర్శణ రాజేంద్రన్ (Darshana Rajendran)లు ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ దర్శకత్వం వహించిన పరదా (Paradha)అనే సినిమా సైతం త్వరలో విడుదల కానుండడం గమనార్హం.