సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దర్శకుడు సందీప్ రెడ్డి
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి భద్రకాళి ప్రొడక్షన్స్ తరఫున ₹10 లక్షలు విరాళం ఇచ్చారు.

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga), నిర్మాత ప్రణయ్ రెడ్డి(Pranay Reddy) వంగాలు జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి భద్రకాళి ప్రొడక్షన్స్(Bhadrakali Productions) సంస్థ 10 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. సంబంధిత విరాళ చెక్కును భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున దర్శక, నిర్మాతలు సందీప్ రెడ్డి, ప్రణయ్ రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డికి అందచేశారు.