Singer Kalpana: మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో.. సింగర్ కల్పన భేటీ!

  • By: sr |    news |    Published on : Mar 08, 2025 6:55 PM IST
Singer Kalpana: మహిళా కమిషన్ చైర్ పర్సన్‌తో.. సింగర్ కల్పన భేటీ!

Singer Kalpana:

విధాత: ఇటీవ‌ల ఆత్మ‌హాత్యాయ‌త్నం చేసుకుందంటూ సింగ‌ర్ క‌ల్ప‌న‌పై వార్త‌లు బాగా ప్ర‌చారం అయ‌న సంగ‌తి అంద‌రికీ విధిత‌మే.. ఈ నేప‌థ్యంలో చికిత్స అనంత‌రం పూర్తిగా కోలుకున్న సింగర్ కల్పన శనివారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు.

సోషల్ మీడియా సహా పలు యూట్యూబ్ ఛానల్స్ లో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారని కల్పన ఫిర్యాదు చేశారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ను కల్పన కోరారు.

తాను ఒత్తిడితో నిద్ర పట్టక పోవడంతో పొరపాటున మోతాదుకు మించి నిద్రమాత్రలు వేసుకోగా..దానిని ఆత్మహత్య యత్నంగా దుష్పచారం చేశారని ఆమె ఆక్షేపించారు. తాను ఒకసారి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవడమే తప్పన్నట్లుగా ప్రచారం చేశారన్నారు.

ఇది సరైన పద్ధతి కాదన్నారు. మీడియా తమవంటి సినిమా వారి వెంట, సెలబ్రెటీల వెంట పడకుండా సమాజంలోని మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులు, హింసపై ఫోకస్ చేయాలని కోరారు.