Southwest Monsoon | ఆవర్తనం అండతో మరింత చురుగ్గా రుతుపవనాలు..!

Southwest Monsoon | రుతుపవనాలు కేరళ వైపు వేగంగా కదులుతున్నాయి. సాధారణ సమయం కంటే ముందుగానే ఈ ఏడాది రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ వైపు కదిరలి న రుతుపవనాలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి.
తెలంగాణలో రెండు రోజులు మోస్తారు వర్షాలు పడనున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. నేడు తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏపీకి రెండు రోజులపాటు భారీ వర్ష సూచన చేశారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.