ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష

దేశవ్యాప్తంగా 828 పరీక్ష కేంద్రాలు విధాత‌:ఐఐటీ, నిట్‌ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 7,09,519 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం దేశవ్యాప్తంగా 828 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులకు గంటన్నర ముందే అనుమతి ఇచ్చారు. రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహిస్తుండగా.. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9-12 గంటల వరకు కాగా.. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఉండనుంది.

ప్రారంభమైన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష

దేశవ్యాప్తంగా 828 పరీక్ష కేంద్రాలు

విధాత‌:ఐఐటీ, నిట్‌ తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్స్‌ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 7,09,519 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం దేశవ్యాప్తంగా 828 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులకు గంటన్నర ముందే అనుమతి ఇచ్చారు. రెండు షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహిస్తుండగా.. మొదటి షిఫ్ట్‌ ఉదయం 9-12 గంటల వరకు కాగా.. రెండో షిఫ్ట్‌ మధ్యాహ్నం 3-6 గంటల వరకు ఉండనుంది.