Rain Alert : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నల్గొండ, యాదాద్రి, గద్వాల సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా వర్షాలు మరింత పెరిగే అవకాశం.

Rain Alert : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert | విధాత : క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజుల పాటు కూడా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ వెల్లడించింది. నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్‌ నగరంలో శుక్రవారం రాత్రి, శనివారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు పేర్కొంది.

ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 13, 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.