TG EAPCET 2025 | క్యూఆర్ కోడ్‌తో.. టీజీ ఎప్‌సెట్ హాల్ టికెట్లు..
హైదరాబాద్ : ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఎప్‌సెట్‌కు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 20 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించబోయే అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సులకు సంబంధించిన హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. మే 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించే ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 22 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ సారి కొత్తగా ప్రతి హాల్ టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. సదరు విద్యార్థికి కేటాయించిన సెంటర్ అడ్రస్.. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలుస్తుంది. దీంతో సులువుగా గూగుల్ మ్యాప్ ద్వారా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.
అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష ఈ నెల 29, 30 తేదీల్లో జరుగనుంది. ఏప్రిల్ 29న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 12 గంటలకు వరకు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తారు. ఇక ఈ నెల 30న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఇంజినీరింగ్ పరీక్షను మే 2 నుంచి 4 వరకు నిర్వహిస్తారు. రోజూ రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 12 గంటలకు వరకు నిర్వహిస్తారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,420 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ ఎగ్జామ్‌కు 86,101 మంది, రెండు పరీక్షలకు 253 మంది దరఖాస్తు చేసున్నారు. వీరికోసం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 124 కేంద్రాలను ఏర్పాటు చేశారు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram