ఈ దేవుళ్లను ఆ పూలతో అసలు పూజించకూదడట..! పూజిస్తే చెడు ఫలితాలేనట..!!
భక్తులు తమకు ఇష్టమైన దేవుళ్లకు ప్రతి రోజు పూజలు చేస్తుంటారు. కొందరు ఇంట్లోనే పూజలు చేస్తే, మరికొందరు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇక పూలు లేకుండా పూజ నిర్వహించనే నిర్వహించరు. అయితే జ్యోతిష్యం ప్రకారం దేవుళ్లకు సమర్పించకూడని పూలు కూడా ఉన్నాయనే విషయాన్ని భక్తులు తెలుసుకోవాలి. అలాంటి పూలను సమర్పిస్తే ఆ భగవంతుడుఇ ఆశీస్సులు పొందడమేమో కానీ, ఆయన ఆగ్రహానికి తప్పకుండా గురవుతారనేది పండితుల నమ్మకం. కాబట్టి ఏ పూలు ఏ దేవుడికి సమర్పించకూడదో తెలుసుకుందాం..
శివుడు : ఆ పరమ శివుడిని పూజించే సమయంలో కేతకి లేదా కేవద పుష్పాలను సమర్పించకూడదట. ఆ పువ్వులతో పరమేశ్వరుడికి పూజ చేస్తే కోపం తెప్పించిన వాళ్లం అవుతామట. అలాగే పూజ కూడా ఫలించకపోవచ్చని పండితులు చెబుతున్నారు.
రాముడు : శ్రీరాముడికి గన్నేరు పువ్వులను అసలు సమర్పించకూడదట. ఈ పువ్వులను శ్రీరాముడి పూజలు అశుభంగా భావిస్తారు. ఈ పూలతో రాముడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరకపోవచ్చు. అనుకున్న ఫలితాలు పొందకపోవచ్చు అని పండితులు చెబుతున్నారు.
దుర్గాదేవి : దుర్గాదేవికి రేకులతో కూడిన పువ్వులు, ఘాటైన వాసన కలిగిన పువ్వులు, నేలపై పడిన పువ్వులను పూజ సమయంలోఎట్టి పరిస్థితుల్లో సమర్పించకూడదట. ఈ పువ్వులను దుర్గాదేవి అప్రియమైనవిగా భావిస్తుందట. తద్వారా ఆమె ఆశీస్సులు పొందడం సాధ్యం కాదట.
సూర్య భగవానుడు : చాలా మంది ఉదయం లేవగానే సూర్య భగవానుడిని పూజిస్తుంటారు. సూర్య దేవుడిని ఆరాధించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బెల పత్రాన్ని సమర్పించకూడదట. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడికి కోపం రావచ్చంటున్నారు పండితులు. మీరు ఆయన ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు.
విష్ణువు : త్రిమూర్తులలో ఒకరైన విష్ణువును పూజించే సమయంలో కొన్ని పూలకు దూరంగా ఉండడం మంచిదట. మహా విష్ణువును ఆరాధించే సమయంలో ఎప్పుడూ అగస్త్య పుష్పాలను సమర్పించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయట.
పార్వతీదేవి : జిల్లేడు, ఉమ్మెత్త పూలు పరమశివునికి ఇష్టమైనవి. కానీ, పార్వతి దేవికి జిల్లేడు పూలను సమర్పించడం మంచిది కాదంటున్నారు పండితులు. ఇలా చేయడం వల్ల అమ్మవారికి ఆగ్రహం తెప్పించినవారువుతారట. కాబట్టి.. పార్వతీ దేవిని పూజించేటప్పుడు ఈ పూలను సమర్పించకపోవడం మంచిది అంటున్నారు పండితులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram