Horoscope | జ‌న‌వ‌రి 18, శ‌నివారం.. మీ రాశి ఫలాలు! వారికి ఖ‌ర్చులు అధికంగా ఉంటాయి

  • By: sr    news    Jan 18, 2025 6:28 AM IST
Horoscope | జ‌న‌వ‌రి 18, శ‌నివారం.. మీ రాశి ఫలాలు! వారికి ఖ‌ర్చులు అధికంగా ఉంటాయి

Horoscope | జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి నుంచి చెర‌గ‌ని నమ్మకం. లేచిన స‌మ‌యం నుంచి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ఆ రోజు మ‌న రాశి ఫ‌లాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెలికేది వారికి ఆరోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల పేర‌ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

 

మేషం (Aries) :

ఈ రోజు ఆఫీసు బాధ్యతల వల్ల వ్యక్తిగత పనులకు సమయం ఇవ్వలేరు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు. ఇత‌రుల‌కు సేవ చేయడంపై ఆసక్తి ఉంటుంది. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం

వృషభం (Taurus) :

మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొద్దిపాటి శ్రమతోనే అనుకున్న పనులు అవుతాయి. కానీ సంతృప్తి ఉండ‌దు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. నిగూడ అంశాల అధ్యయనంలో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటారు

మిథునం (Gemini) :

ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. వైవాహిక జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ మధ్యాహ్నంలోగా పూర్తి చేయాలి. వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో గ‌డుపుతారు. అపార్థాల‌కు పోవ‌ద్దు. ఆలోచ‌న‌లు బాగుంటాయి. అనుకున్న‌వి జ‌రుగుతాయి.

కర్కాటకం (Cancer) :

వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. మాటలకు, ఆలోచనలకు ప్రాధాన్యత చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో స్వ‌ల్ప స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు.. ఆందోళన అవ‌హిస్తుంది. ఆక‌స్మిక బ‌హుమానాలు అందుకుంటారు. పెద్ద‌లు తీర్థ‌యాత్ర‌ల‌కు రెడీ అవుతారు.

సింహం (Leo) :

ఈ రోజు చాలా మంచి రోజు. పిల్లలు మీ మాటలు వింటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. విదేశీ ప్ర‌య‌త్నాలు చేస్తారు.వాహ‌నం, ఇంటి నిర్మాణం కోసం ప్ర‌య‌త్నం చేస్తారు.

కన్య (Virgo) :

ఈ రాశి వారి వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లొచ్చి ప‌రిష్కారం అవుతాయి. ఉద్యోగం విష‌యంలో కొత్త ఆలోచనలు ప్రారంభ‌మ‌వుతాయి. నిర్ణ‌యాలు ధైర్యంగా తీసుకుంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్త మంచిది. ప్ర‌యాణాలు చేస్తారు. ఫ్యామిలీలో సంద‌డి ఉంటుంది.

తుల (Libra) :

ఈ రాశి వారు ఈ రోజు అప్ర‌మ‌త్తంగా ఉండడం మంచిది. ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాన‌సిక చింత‌న ఉంటుంది. ప్రేమ సంబంధాల విషయంలో ఇబ్బందులుంటాయి. కొన్ని ప‌నుల్లో ఆటంకాలు వ‌చ్చినా పూర్తి చేస్తారు.

వృశ్చికం (Scorpio) :

ఈ రోజు సబార్డినేట్ ఉద్యోగులు సాయం చేస్తారు. రోజంతా అనుకూలంగా ఉంటుంది. త‌ల‌పెట్టిన ప్ర‌తి పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభ‌దాయ‌క‌మైన కొత్త సంబంధాలు ఏర్పడతాయి. భాగ‌స్వామితో క‌లిసి నూత‌న నిర్ణ‌యాలు తీసుకుంటారు. రుణాలు ఇస్తారు.

ధనుస్సు (Sagittarius) :

ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు నచ్చిన విద్యాసంస్థల్లో ప్రవేశం. ఉద్యోగ‌స్తుల‌కు పై అధికారులు కొత్త ఆదేశాలు ఇస్తారు. ప్రేమ సంబంధాల విషయంలో సీరియస్‌గా ఉంటారు. మాట ప‌ట్టింపులు లేకుండా ఉండాలి. సంతాన వృద్ధి కొర‌కు ఆలోచ‌న చేస్తారు.

మకరం (Capricorn) :

ఉద్యోగస్తులకు ఉదాసీనత ఉంటుంది. కోపానికి త‌గ్గించుకోవాలి. ఒత్తిడిని అధిగమించేందుకు స్నేహితుల సహకారం తీసుకోండి. ఆధ్యాత్మిక గ్రంధాలు చ‌దివేందుకుకు ఇష్ట ప‌డ‌తారు. ఆల‌యాల‌కు వెళ‌తారు. కొత్త విష‌యాలు తెలుసుకుంటారు. స్థాన చ‌ల‌న ప్ర‌య‌త్నాలు అనుకూలంగా ఉంటాయి.

కుంభం (Aquarius) :

ఈ రోజు మీ ప్రతికూల ఆలోచనలతో మీలో చాలా మార్పులు రావొచ్చు. ఇతరుల పనుల్లో త‌ల‌దూర్చ‌కుండా ఉంటే మంచిది. కమీషన్ సంబంధిత పనుల వల్ల లాభం ఉంటుంది. వ్యాపారంలో పొరపాట్లతో నష్టపోతారు.భూముల విష‌యంలో వాగ్వాదాలు ఏర్ప‌డుతాయి. ఆల‌యాల‌కు వెళ‌తారు.

మీనం (Pisces) :

ఖ‌ర్చులు అధికంగా ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల సమయం. మీ ప్ర‌య‌త్నాల‌కు, ఆలోచ‌న‌ల‌కు అధికారుల నుంచి మద్దతు ల‌భిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వాహ‌నాలు న‌డిపేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండాలి