తాజ్ మహాల్‌ను.. సందర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
విధాత: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్‌ను సందర్శించారు. ఆగ్రాకు వచ్చిన జేడీ వాన్స్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. జేడీ వాన్స్, ఆయన సతీమణి భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరి, తమ పిల్లలతో తాజ్ మహల్‌ను సందర్శించి ఫోటోలతో సందడి చేశారు.

తమ పిల్లలతో కలిసి జేడీ వాన్స్, ఉషా దంపతులు తాజ్ మహల్ పైకి ఎక్కి నిర్మాణాన్ని దగ్గరగా తాకి పరిశీలించి మురిసిపోయారు. జేడీ వాన్స్ దంపతులు నాలుగు రోజుల భారత్ పర్యటనకు వచ్చారు.అక్షర ధామ్ సందర్శన అనంతరం జైపూర్ కోటలను సందర్శించారు. ఈ క్రమంలో బుధవారం ఆగ్రాలో ఉన్న వరల్డ్ వండర్ తాజ్ మహల్ ను సందర్శించారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram