• Telugu News
  • /Trending

Sandwich | రైల్లో శాండ్‌విచ్ ప్రిపేర్ చేసిన ఫ్యామిలీ.. నెట్టింట విప‌రీతంగా చ‌ర్చ‌

రైల్లో (Train) ఓ ఫ్యామిలీ శాండ్‌విచ్ ప్రిపేర్ చేసిన (Family Makes Sandwiches Inside Train) వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇది ఆన్‌లైన్‌లో చ‌ర్చ‌కు దారితీసింది.

Reported by: Tejaswini Nanna | ట్రెండింగ్ | Feb 23, 2026, 6:57 pm IST
Read Time: 4 mins
Sandwich | రైల్లో శాండ్‌విచ్ ప్రిపేర్ చేసిన ఫ్యామిలీ.. నెట్టింట విప‌రీతంగా చ‌ర్చ‌

Sandwich | సుదూర ప్రాంతాల‌కు ప్ర‌యాణించాలంటే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది రైలే (Train). ఎందుకంటే బ‌డ్జెట్ ఫ్రెండ్లీ కాబ‌ట్టి. రోజుల త‌ర‌బ‌డి ప్ర‌యాణం చేయాలంటే ఎక్కువ మంది దీన్నే ఎంచుకుంటారు. తీర్థ‌యాత్ర‌లు వంటి వాటికి ప్ర‌జ‌లు రైలు ప్ర‌యాణాన్నే ప్రిఫ‌ర్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం క‌లిసి జ‌ర్నీని ఆస్వాదిస్తుంటారు. గేమ్స్ ఆడుతూ.. ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తూ ఆడుతూపాడుతూ ప్ర‌యాణాన్ని ఆస్వాదిస్తుంటారు. తాజాగా రైల్లో ఓ ఫ్యామిలీ శాండ్‌విచ్ ప్రిపేర్ చేసిన (Family Makes Sandwiches Inside Train) వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇది ఆన్‌లైన్‌లో చ‌ర్చ‌కు దారితీసింది.

రైలు కోచ్‌లో కూర్చున్న ఓ ఫ్యామిలీ బ్రెడ్ స్లైసెస్‌, కీరా, ట‌మాటా, ఆనియ‌న్స్ వంటి వాటితో శాండ్‌విచ్ త‌యారు చేసింది. బ్రెడ్ ముక్క‌ల‌కు పుదీనా చ‌ట్నీని రాస్తూ.. అందులో టామాటాలు, దోస‌కాయ ముక్క‌లు, సాస్‌లు, చ‌ట్నీలు వంటి ప‌దార్థాల‌తో రుచిక‌ర‌మైన ఆహారాన్ని త‌యారు చేస్తూ క‌నిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు.

నిత్యం వేలాది మంది ప్ర‌యాణించే రైల్లో ఇలా వంట‌కాలు చేయ‌డం ఏంట‌ని..? ప్ర‌శ్నిస్తున్నారు. అది రైలు సొంత కిచెన్ అనుకుంటున్నారా..? అంటూ మండిప‌డుతున్నారు. కొంచెం సామాజిక స్పృహ‌తో ప్ర‌వ‌ర్తించండి అంటూ చుర‌క‌లంటిస్తున్నారు. మ‌రికొంద‌రైతే వారు చేసిన ప‌నిని స‌మ‌ర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Bharat Taxi App | టాక్సీ ఓనర్లను సంపన్నులను చేసే భారత్‌ ట్యాక్సీ యాప్‌
OTT Movies | ఓటీటీలోకి కొత్త కంటెంట్ .. ఈ వారం స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితా