What are tides in the ocean? | సముద్రంలో ఆటుపోట్లు అంటే ఏంటి. అవి ఎలా వస్తాయి

సముద్రంలో ఆటుపోట్లు (Tides) అంటే చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్ర మట్టం పెరగడం (పోటు), తగ్గడం (ఆటు). చంద్రుని ప్రభావమే ప్రధానం. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఇవి అత్యంత బలంగా ఉంటాయి.

What are tides in the ocean? | సముద్రంలో ఆటుపోట్లు అంటే ఏంటి. అవి ఎలా వస్తాయి

సముద్రంలో ఆటుపోట్లు అని ఎక్కువగా వింటుంటాం.. అసలు ఆటుపోట్లు అంటే ఏంటి అవి ఎలా వస్తాయి. వాటకి కారణం ఎంటో వివరంగా తెలుసుకుందాం.. చంద్రుడు, సూర్యుని గురుత్వాకర్షణ ప్రభావం వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఇలా జరిగే ప్రక్రియనే ఆటుపోట్లు అని అంటారు.

సముద్రంలో ఆటుపోట్లకు కారణాలు..

సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడటానికి చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ప్రధాన కారణం. ఇది భూమిపై ఉన్న సముద్రపు నీటిని తన వైపు లాగుతుంది. దీని ఫలితంగా చంద్రుడి వైపు ఉన్న సముద్రంలో నీరు ఉబ్బెత్తుగా మారుతుంది. దీనిని అధిక పోటు లేదా పోటు అని అంటారు. అదే సమయంలో భూమికి ఎదురుగా ఉన్న భాగంలో కూడా ఒక ఉబ్బెత్తు ఏర్పడుతుంది. భూమి చంద్రుడు ఒకరికి ఒకరు కక్ష్యలో తిరగడం వల్ల ఈ ప్రభావం ఏర్పడుతుంది. ఈ రెండు ఉబ్బెత్తుల మధ్య ఉన్న ప్రాంతంలో నీటి మట్టం తగ్గుతుంది, దీనిని ఆటు అని అంటారు. అయితే చంద్రుడు భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతాడు కాబట్టి అప్పుడప్పుడు భూమికి దగ్గరగా వస్తాడు ఇటువంటి సమయంలో గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు అధికంగా కనిపిస్తాయి.

అలాగే సూర్యుని గురుత్వాకర్షణ కూడా కొంత మేరకు ఉంటుంది. కానీ ఇది చంద్రుడి ప్రభావం కంటే తక్కువే అని చెప్పవచ్చు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు అంటే పౌర్ణమి, అమావాస్య సమయాల్లో వాటి సంయుక్త గురుత్వాకర్షణ కారణంగా సముద్రంలో అత్యంత బలమైన ఆటుపోట్లు సంభవిస్తాయి. వీటితోపాటు భూ భ్రమణం కూడా ఓ కారణం. అంటే భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల ప్రతిరోజు తీర ప్రాంతాలు ప్రతి 24 గంటల 50 నిమిషాలకు సుమారుగా రెండు సార్లు ఆటు, రెండు సార్లు పోటుకు గురవుతాయి.