హిందూపురంలో బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం 31,602 ఓట్లతో గెలుపు
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 31,602ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి టి.ఎన్. దీపికపై విజయం సాధించారు.
విధాత, హైదరాబాద్ : హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 31,602ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి టి.ఎన్. దీపికపై విజయం సాధించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది. 2014, 2019, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బాలకృష్ణ హాట్రిక్ విజయాన్ని సాధించారు. 2014లో బాలకృష్ణ టీడీపీ నుంచి పోటీ చేసి 81,543 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాలకృష్ణ విజయంతో ఆయన నివాసం వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram