CPI Narayana : ధర్మస్థలిని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కర్నాటకలోని ధర్మస్థల ట్రస్ట్‌ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని డిమాండ్ చేశారు. ట్రస్ట్ ఆస్తులు, వివాదాలు, SIT విచారణపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
CPI Narayana | విధాత : ధర్మస్థల ట్రస్ట్ ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తిరులమ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కర్నాటకలోని ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని..ఆ ట్రస్ట్ చైర్మన్ ను బీజేపీ ఎంపీగా నామినేట్ చేసిందని గుర్తు చేశారు. సంవత్సరానికి రూ.100కోట్ల ఆదాయం..10వేల కోట్ల ఆస్తులు ఆ ట్రస్టు కలిగి ఉందన్నారు.
ట్రస్ట్ పరిధిలో ఇప్పటిదాక దాదాపు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేసి అక్కడే పూడ్చిపెట్టారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి విచారణకు సిట్ వేసిందని..అదే బీజేపీ సర్కార్ ఉంటే సిట్ కూడా ఏర్పాటు చేసేది కాదని విమర్శించారు. స్మశాన వాటికలో ఉన్నట్లు అక్కడ అన్నీ పుర్రెలు, ఎముకలు భయటపడుతున్నాయన్నారు.
సీపీఐ నేత ఎంపీగా పోటీ చేయకూడదని గతంలో ట్రస్ట్ సభ్యులు అడ్డుకున్నారని..అతను తెగించి పోటీ చేసినందుకు పదిహేనేళ్ల తన కుమార్తెను రేప్ చేసి చంపేశారని నారాయణ ఆరోపించారు.
Read more : తెలుగులో ఈవారం ఓటీటీ కంటెంట్ మేళా – మయసభ నుంచి అరేబియా కడలి వరకు
తెలంగాణకు ఐదు రోజులు భారీ వర్షసూచన
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram